హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 28: మధురమైన పాటలు వినడం ద్వారా మానసిక ఆనందంతో పాటు ప్రశాంతత చేకూరుతుందని ఘంటసాల గంధర్వగాన అమృత వేదిక వ్యవస్థాపకులు మహేశ్వరం ఉపేందర్ అన్నారు. పద్మాక్షీరోడ్డులో డాక్టర్ జగదీష్‌బాబు కళావేదికలో ఏర్పాటు చేసిన సినీసంగీత స్వరార్చన కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ప్రతినెల ఈ కార్యక్రమం వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తున్నామని నగరంలోని ఆసక్తిగల గాయకులను ప్రోత్సహించటం తమ లక్ష్యమని తెలిపారు.
ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ విశిష్టఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సంస్థ నిర్వహిస్తున్న అనేక కళాకార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని, మంది గాయకులు వివిధ చిత్రాల్లోని పాటలను మధురంగా ఆలపించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయ్‌కుమార్, టీవీ రమేష్, శ్రీధరస్వామి, రాధాదేవి, మాధవి, దేవిక పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా రంగమణ కార్యక్రమాన్ని రక్తికట్టించారు.