Pakistan President : ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దాయాది దేశాన్ని కాళ్లబేరానికి వచ్చేలా చేసిన ఈ ఆపరేషన్ ప్రభుత్వ పెద్దల గుండెల్లో గబులు రేపింది. భారత సైన్యం క్షిపణులతో విరచుకుపడిన ఆ రోజులపై పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ(Asif Ali Zardari ) తాజాగా స్పందించారు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు తనను బంకర్లో దాక్కోవాలని అధికారులు సూచించారని ఆయన వెల్లడించారు.
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడితో రగిలిపోయిన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌పై కన్నెర్రజేసింది. మే 7వ తెల్లవారు జామునే క్షిపణుల దాడులతో ఆ దేశంలోని ఉగ్రస్థావరాలనే తునాతునకలు చేసింది. ఈ సందర్భంగా పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని బంకర్లోకి వెళ్లాలని సైనిక అధికారులు సూచించారట. ఈ విషయాన్ని జర్దారీనే స్వయంగా తెలిపారు.
Pakistan President Asif Ali Zardari said that their military was hiding in bunkers during Op Sindoor.
“Military advised me also to hide inside the bunkers during Op Sindoor.” pic.twitter.com/ocGRifm1l5— War & Gore (@Goreunit) December 28, 2025
ఆదివారం ఒక సభలో మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మా సైన్యం బంకర్లో దాక్కుంది. నా భద్రతాధికారి నా వద్దకు వచ్చి ”సార్ యుద్ధం మొదలైంది. మనం బంకర్లోకి వెళ్లుదాం” అని చెప్పారు. అయితే.. నేను ఆయన సలహాను తిరస్కరించాను. భారత్ నుంచి ప్రతిచర్య ఉంటుందని నేను ముందుగానే ఊహించాను. కానీ, బంకర్లో తలదాచుకునేందుకు మాత్రం అంగీకరించలేదు’ అని పాక్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
OPERATION SINDOOR
Indian Army Pulverizes Terrorist Launchpads
As a response to Pakistan’s misadventures of attempted drone strikes on the night of 08 and 09 May 2025 in multiple cities of Jammu & Kashmir and Punjab, the #Indian Army conducted a coordinated fire assault on… pic.twitter.com/2i5xa3K7uk
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 10, 2025
పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉండడంతో ఆపరేషన్ సిందూర్‌తో దాయాదికి బుద్ధి చెప్పింది భారత సైన్యం. మే 7న ఉదయం నుంచే క్షిపణులతో పాక్‌లోని ఉగ్ర కేంద్రాలను పేల్చేసింది. పాక్ సైన్యం కూడా క్షిపణులతో దాడి చేసినా.. భారత సైన్యం వాటిని కూల్చేసింది. చివరకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGCA) చీఫ్ భారత డీజీసీఏ అధికారిని సంప్రదించారు. కాల్పుల విరమణను అతడు ప్రతిపాదించగా భారత అధికారి అంగీకరించారు.