Electric Shock | వేములవాడ రూరల్, జూన్ 19 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్‌లో విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ లైన్మెన్ సంజీవ్‌కు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఫాజుల్‌నగర్ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన మరమ్మతు పనులు నిర్వహిస్తున్న సమయంలో లైన్మెన్ సంజీవ్‌కు ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ షాక్ తగిలినట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, సహచర సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విద్యుత్ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.