Lightning strikes | కథలాపూర్, జూన్ 9 : కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో గడ్డం లింగారెడ్డి ఇంటిపై సోమవారం ఉదయం పిడుగు పడింది. పిడుగుపాటు వల్ల లింగారెడ్డి ఇంటి భవనం పై భాగం కొద్దిగా పగుళ్లు చూపింది.
పిడుగు ప్రభావం వల్ల లింగారెడ్డి ఇంటిలోని ఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అతడి పక్క ఇంట్లో రెండు ఫ్యాన్లు కాలిపోయాయన్నారు. పిడుగు పడడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.