LIC Union formation | కోల్ సిటీ, అక్టోబర్ 1: భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భావ వేడుకలను బుధవారం గోదావరిఖనిలో గల ఎల్ఎసీ బ్రాంచి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆర్థిక కార్యదర్శి అంబాల బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. 1964లో ముంబయిలో యూనియన్ ఆవిర్భవించిందనీ, యూనియన్ కు మొదటి ఆలిండియా అధ్యక్షులు దేవుద్ భద్రి తొలి అధ్యక్షత వహించారన్నారు. ఆనాటి నుంచి ఏజెంట్ల హక్కుల కోసం పోరాడుతూనే ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో శాఖ కార్య నిర్వహణాధికారి గోపతి మల్లేష్, జోనల్, డివిజన్ బ్రాంచి నాయకులు ఆకుల సురేష్, రమణారావు, చింతల శ్రీనివాస్, గుడికందుల రవి, పోత రాజు, చింతం శ్రీనివాస్, కొండపాక శ్రీధర్, తిరుపతి రెడ్డి, బోళ్ల చంద్రశేఖర్, శివ ప్రసాద్, నగేశ్, కొల్లూరి మహేశ్, బత్తుల మహేశ్, కట్ట శ్రీనివాస్, సత్యనారాయణ, రవికాంత్, శ్రవణ్, దుర్గరావు, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.