కార్పొరేషన్, జూన్ 20 : ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవం తం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాకే తలమాణికంగా నిర్మించిన తీగెల వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రంపంచస్థాయి ప్రమాణాలతో కరీంనగర్‌కే తలమాణికంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని బుధవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు.
బుధవారం సాయంత్రం కరీంనగర్‌కు చేరుకోనున్న మంత్రి కేటీఆర్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని, మున్సిపల్ కార్యాలయం నుంచి కమాన్ మీదుగా కేబుల్ బ్రిడ్జి కి చేరుకుంటారని, అకడి నుంచి కేబుల్ బ్రిడ్జిపై పర్యటించి డయాస్ వద్దకు చేరుకుంటారని తెలిపా రు. మొదటగా క్రాకర్ షో, లేజర్షోల తర్వాత డైనమిక్ లైటింగ్, సెంట్రల్ మీడియన్ లైటింగ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఎకడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులతో సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్‌రావు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయడు, ఏసీపీ అడ్మిన్ శ్రీనివాస్, సుడా చైర్మన్ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, శిక్షణ కలెక్టర్లు నవీన్ నికోలస్, లెనిన్ వత్సల్ టోప్పో, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం పరిశీలించారు. ఎక్కడా సమస్యలు రా కుండా అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారు లు, పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ము ఖ్యంగా బ్రిడ్జి వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయాలు, ఇతర సౌకర్యాల విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులతోనూ సమీక్ష నిర్వహించి ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల స్టేజీ వద్ద సాగుతున్న పనులను మంత్రి పరిశీలించారు.
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా నగరంలోని పలు రోడ్లన్నీ గులాబీమయమయ్యా యి. అమాత్యుడు పర్యటించే రోడ్లకిరువైపులా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న హోర్డింగ్‌లు, ప్లెక్సీ లు ఏర్పాటు చేశారు. అలాగే, కమాన్ చౌరస్తా నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు భారీ ప్లెక్సీలు పెట్టా రు. మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జి ప్రా రంభం అనంతరం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల సభకు సుమారుగా 10 వేలపైగా నగరవాసులు తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. దీనికి అ నుగుణంగా మానేరు రివర్ ఫ్రంట్ వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు రాత్రి వేళ ఇబ్బం ది రాకుండా పెద్ద ఎత్తున్న లైటింగ్ సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ కళాకారులు వస్తుండడంతో ప్రజలు భారీగానే తరలివచ్చే అవకాశాలున్నాయి.