Sunke Ravishankar | గుడికో జమ్మి మొక్క నాటుదాం.. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గుడికో జమ్మి మొక్కలు నాటుదామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని పోచమ్మ గుడి ఆవరణలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం జమ్మి మొక్క నాటారు.
Sunke Ravishankar | గంగాధర, అక్టోబర్ 10 : మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గుడికో జమ్మి మొక్కలు నాటుదామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని పోచమ్మ గుడి ఆవరణలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం జమ్మి మొక్క నాటారు. అనంతరం పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ, దసరా, దేవి నవరాత్రుల సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఊరు ఊరికో జమ్మి చెట్టు-గుడి గుడికో జమ్మి చెట్టు సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.
వేలాదిగా జమ్మి మొక్కలను సిద్ధం చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలకు,దేవాలయాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని పలు దేవాలయాల వద్ద జమ్మి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అనంతరం బిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులతో కలిసి ఊరూర జమ్మి చెట్టు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు మేచినేని నవీన్ రావు, నాయకులు కంకణాల విజేందరరెడ్డి, రామిడి సురేందర్, బొల్లాడి శ్రీనివాసరెడ్డి, మామిడిపల్లి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

