Allocation of funds | సారంగాపూర్, జూన్ 30: మండలంలోని ఆర్పల్లి గ్రామానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులు మంజూరు చేయడం పట్ల మాజీ వైస్‌ఎంపీపీ, గ్రామ నాయకులు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను మండల కేంద్రంలో శాలువాతో సన్మానించారు.
ఆర్పల్లి గ్రామంలో డీ 53 కెనాల్ మీద బ్రిడ్జి డ్యామేజీ కావడంతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రూ.29లక్షలు, రెడ్డి సంఘం బిల్డింగ్ నుండి డీ 58 కెనాల్ వరకు తారురోడ్డుకు రూ.కోటి, స్మసానవాటిక నుండి 15 ఆర్ కెనాల్ వరకు తారురోడ్డుకు రూ. 74 లక్షలు, సీసీ రోడ్లకు రూ.85 లక్షలు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.56 లక్షలు, రెండు అంగన్వాడీ బిల్డింగ్స్‌కు రూ.24 లక్షలు, రెండు కిచెన్ షెడ్లు నిర్మానానికి రూ.10లక్షలు మంజూరు చేశారు. కాగా నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పోల్లు సురేంధర్, నాయకులు లక్కాడి లింగారెడ్డి, రెడ్డి తిరుపతి రెడ్డి, పడిగెల రవింధర్ రెడ్డి, ఎండబెట్ల మానిక్యం, జుంజురు రాజన్న తదితరులు పాల్గొన్నారు.