Vemulawada | వేములవాడ, జూన్ 20: వేములవాడలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ మాజీ క్యాషియర్ పి. నారాయణ ను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి అమానుషంగా దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ కోర్టు ముందు న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల ను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు కటకం జనార్ధన్, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్ గౌడ్, పొత్తూరు అనిల్ కుమార్, గుడిసె సదానందం, కిషోర్ రావు, కోడిమ్యాల పురుషోత్తం, పెంట రాజు, వేముల సుధాకర్ రెడ్డి, పర్లపల్లి అంజయ్య, నక్క దివాకర్, పిల్లి మధు, జంగం అంజయ్య, మాదాసు దేవయ్య, కమటం అంజయ్య, గోగికారి శ్రీనివాస్, నాగుల సంపత్, గొంటి శంకర్, సుంకపాక నవీన్, నడిగట్ల హరికృష్ణ, భీమా మహేష్, కనికరపు శ్రీనివాస్, జెట్టి శేఖర్, మారుమొఖం అనిల్ కుమార్, పొత్తూరు మల్లేష్, గుజ్జే మనోహర్, వడ్లకొండ శ్రీకాంత్, మహిళా న్యాయవాదులు జక్కుల పద్మ, బూర సరిత ఉన్నారు.