Tennis Competitions | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం ఏరియా-1 పరిధిలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న అంతర్గత 2026-27 క్రీడల్లో భాగంగా శుక్రవారం లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద గల లాన్ టెన్నిస్ కోర్టులో నిర్వహించిన పోటీలకు ముఖ్య అతిథిగా ఏసీపీ (AR) సీ ప్రతాప్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి తో పాటు కార్మికులు క్రీడలు ఆడుతూ ఫిట్ నెస్ గా ఉండాలని, క్రీడల వల్ల లాభమే తప్ప నష్టం లేదని అన్నారు.
ఈ క్రీడా పోటీలలో బాగా ఆడి కోల్ ఇండియా స్థాయికి ఎంపికై రాణించాలని క్రీడాకారులకు ఆకాంక్షించారు.ఈ పోటీల్లో ఆర్.జి-1 ఏరియా పరిధిలోని వివిధ గనులు, విభాగాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో WPS&GA గౌరవ కార్యదర్శి జీ హనుమంతరావు, కోఆర్డినేటర్ గాండ్ల రాజయ్య , వివిధ గనుల క్రీడాకారులు, క్రీడాభిమానులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.