‘సింగరేణి దర్శన్’
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సింగరణి దర్శన్ పేరిట కోల్ మైన్స్ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రారంభించింది. ఇందుకు ప్రతిశనివారం ప్రత్యేక బ స్సు సర్వీసును నడుపుతున్నది. గురువారం క రీంనగర్ ఆర్ఎం ఖుస్రోషాఖాన్ వివరాలు వెల్లడించారు. ఈ స్పెషల్ బస్సు హైదరాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి కరీంనగర్ మీదుగా గోదావరిఖనిలోని సింగరేణి గనులకు చేరుకుంటుంది.
- టీఎస్ఆర్టీసీ కోల్ టూరిజం స్పెషల్ ప్యాకేజీ ప్రారంభం
- ప్రతి శనివారం ప్రత్యేక బస్సు సర్వీస్
- జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి బయల్దేరి ఖని సింగరేణి గనులకు చేరిక
- జూబ్లీ నుంచి టికెట్ ఒక్కొక్కరికీ 2 వేలు.. కరీంనగర్ నుంచి వెయ్యి..
- వివరాలు వెల్లడించిన కరీంనగర్ ఆర్ఎం ఖుస్రోషాఖాన్
తెలంగాణచౌక్,మార్చి 30: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సింగరణి దర్శన్ పేరిట కోల్ మైన్స్ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రారంభించింది. ఇందుకు ప్రతిశనివారం ప్రత్యేక బ స్సు సర్వీసును నడుపుతున్నది. గురువారం క రీంనగర్ ఆర్ఎం ఖుస్రోషాఖాన్ వివరాలు వెల్లడించారు. ఈ స్పెషల్ బస్సు హైదరాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి కరీంనగర్ మీదుగా గోదావరిఖనిలోని సింగరేణి గనులకు చేరుకుంటుంది. పర్యాటకులు అండర్ గ్రౌండ్ గనులు, ఓపెన్ కాస్ట్‌లు, ఎస్టీపీపీ విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించిన అనంతరం సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి కరీంనగర్ మీదుగా తిరిగి 6.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
జూబ్లీ నుంచి బస్ టికెట్ ఒక్కొక్కరికీ 2 వేలు, కరీంనగర్ నుంచి వెయ్యి ఉంటుందన్నారు. ఈ ప్యాకేజీ కోసం టికెట్లను జూబ్లీ, కరీంనగర్ బస్స్టేషన్లలోని రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద గానీ, ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. సింగరేణి దర్శన్‌కు వెళ్లేవారు 18 సంవత్సరాలు నిండి ఆరోగ్యవంతులై ఉండాలన్నారు. మహిళలు జీన్స్, కుర్తాలు, పైజామా లాంటి వస్ర్తాలు మాత్రమే ధరించాలని సూచించారు. వ్యక్తిగతంగా బాం డ్ మీద సంతకం చేయాల్సి ఉంటుందని, గనుల్లోకి వేళ్లే ముందు తప్పకుండా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ సింగరేణి అధికారులకు అందించాల్సి ఉంటుందని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

