Laptop | ముత్తారం, అక్టోబర్ 26 : ముత్తారం మండలం హరిపురం గ్రామానికి చెందిన రైతుకూలి తాడూరి సంపత్, సుమలత కుమార్తె సంకీర్తన డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నది. అయితే ఆమె ఉన్నత చదువు కోసం ల్యాప్ టాప్ అవసరం ఉండడంతో డబ్బులు లేకపోవడం దాతలకోసం ఎదురు చూస్తుండగా అడవిశ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ బర్ల రాధ చంద్రమౌళి ల కుమారుడు ఎన్ ఆర్ ఐ రునిల్ కుమార్ పటేల్ స్పందించి విద్యార్థి అవసరమైన ల్యాప్ టాప్ ను అడవిశ్రీరాంపూర్ బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నిమ్మతి రమేష్, మాజీ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఒడ్నాల రవి కలసి విద్యార్థి స్వగృహం నందు అందించారు.
ఈ సందర్బంగా ఆ విద్యార్ధి మాట్లాడుతూ ఉన్నత చదువులకు అవసరమైన ల్యాప్ టాప్ అందించిన రునిల్ కుమార్ పటేల్ కు కుటుంబ సభ్యులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామంచ ఓదెలు, నర్ర తిరుపతి, ఏజ్జ తిరుపతి, రామంచ సంపత్ రాజ్, తాడూరి కిషన్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.