Land registrations | గంగాధర, జూన్ 27 : గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని సుమారు 240 సర్వే నెంబర్లలో భూముల రిజిస్ట్రేషన్ అధికారులు నిలిపివేశా. నిషేధిత సర్వే నెంబర్లలోని భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దని జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి ఇచ్చిన ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రేకుర్తి పరిధిలో నిషేధిత జాబితాలు తయారు చేయడానికి రెవెన్యూ అధికారులు వారం రోజుల్లో సర్వే నెంబర్ల పై స్పష్టత వచ్చే వరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి.
గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు
కార్యాలయంలో రేకుర్తి రెవిన్యూ గ్రామ పరిధిలోని సుమారు 240 సర్వే నంబర్లకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ లను అధికారులు నిలిపివేశారు. సదరు సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో గురువారం రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ లను చేయవద్దని అధికారులను ఆదేశించారు. రేకుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో దాదాపు 300 సర్వే నంబర్లు ఉండగా సుమారు 200 సర్వే నంబర్లను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. సదరు భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు, 240 సర్వే నెంబర్లలో స్పష్టత వచ్చేవరకు రిజిస్ట్రేషన్ లను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా రెవెన్యూ శాఖ అధికారులు నిషేధిత జాబితాను తయారు చేస్తుండగా వారం రోజుల్లో నిషేధిత సర్వే నంబర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు సదరు రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి.
నాడు కొత్తపెల్లి -నేడు రేకుర్తి
గత నెల రోజుల క్రితం కొత్తపెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో సీలింగ్ భూముల్లో చేసిన 476 రిజిస్ట్రేషన్ లను రద్దు చేసిన వ్యవహారాన్ని ప్రజలు మరువకముందే, రేకుర్తి భూముల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇక్కడ భూములు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో కేవలం మూడు సర్వే నంబర్లు 175,197,198 లో మాత్రమే భూముల రిజిస్ట్రేషన్ లను అధికారులు రద్దు చేయగా, రేకుర్తి రెవెన్యూ పరిధిలో సుమారు 240 సర్వే నంబర్లను బ్లాక్ లిస్టులో చేర్చడంతో జిల్లాలో కలకలం మొదలైంది. రేకుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో ఏ సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉంటాయో? తాము కొనుకోలు చేసిన భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయా? నిషేధిత జాబితాలో ఉంటే తాము ఎలా ముందుకు వెళ్లాలి? అనే విషయాలపై భూములు కొనుగోలు చేసిన వారు ఆరా తీస్తున్నారు. వారం రోజులలో సదరు సర్వేనెంబర్ లపై స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో సర్వత్ర ఉత్కంఠం నెలకొంది.
రేకుర్తి రిజిస్ట్రేషన్లు నిలిపివేత, అఫ్జల్ నూర్ ఖాన్, సబ్ రిజిస్ట్రార్, గంగాధర
రేకుర్తి భూముల విషయంలో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రేకుర్తి రెవిన్యూ పరిధిలోని సుమారు 240 సర్వే నంబర్లలో నిషేధిత జాబితా తయారు చేయాలని కలెక్టర్ రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. సదరు సర్వే నంబర్లలో స్పష్టత వచ్చే వరకు రిజిస్ట్రేషన్ లను నిలిపివేస్తున్నాము. ఇండ్ల రిజిస్ట్రేషన్ కు సంబంధించి పంచాయతీ కార్యదర్శి తప్పకుండా సర్టిఫై చేయాలి. వారసత్వ భూములకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తాం.