Former MLA Vodithala Satish Kumar | చిగురుమామిడి, ఆగస్టు 8: బీఆర్ఎస్ నాయకుడు దుడ్డెల లక్ష్మీనారాయణ మృతి పార్టీకి తీరనిలోటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని రేకొండ గ్రామంలోని లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఆయన మృత దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీ కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు. సింగిల్ విండో డైరెక్టర్, రజక సంఘం మండల అధ్యక్షుడిగా అనేక సేవలు అందించారని కొనియాడారు.
గ్రామంలో రజక సంఘం ఏర్పాటు, చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారని అన్నారు. వీరి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. వీరి వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకుడు సాంబారీ కొమురయ్య, మండల నాయకుడు పెనుకుల తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు బిల్ల వెంకట్ రెడ్డి, కత్తుల రమేష్, ఎస్కే సిరాజ్, పిల్లి వేణు, బుర్ర తిరుపతి, మండల నాయకులు అభిషేక్ రెడ్డి, కంప అశోక్, నల్ల రాజేందర్ రెడ్డి, సర్వర్ పాషా, అనుమాండ్ల సత్యనారాయణ, మాజీ సర్పంచులు పిట్టల రజిత, బెజ్జంకి లక్ష్మణ్, సన్నీల వెంకటేశం, గోలి బాపు రెడ్డి,బోయిని శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ లు చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకోల రాజయ్య, వివిధ పార్టీల నాయకులు పొన్నం శ్రీనివాస్, పైడిపల్లి శ్రీనివాస్, ఎనగందుల రాజయ్య తదితరులున్నారు.