KTR birthday celebrations | బోయినిపల్లి : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని బోయినపల్లి మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టి ఎంతో మంది పేదలకు, విద్యార్థులకు, సహాయం చేయగా, ఈ సారి వినూత్నంగా కేసీఆర్ కిట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేశారు.
బోయినిపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గంగిపెల్లి రాజశేఖర్-కవిత దంపతులకు గత మూడు నెలల క్రితం జన్మించగా కేటీఆర్ మీద అభిమానం తో వారి కుమారునికి కేటీఆర్ అని నామకరణం చేశారు. వారికీ కేటీఆర్ జన్మదినం సందర్భంగా చొప్పదండి మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ కిట్టు అందజేశారు. కేటీఆర్ కే కేసీఆర్ కిట్టు వచ్చిందని ఈ సందర్భంగా అ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.