Boinpally | బోయినపల్లి రూరల్, జూలై 24 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు 50వ జన్మదిన వేడుకలు శుక్రవారం మండలంలోని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక ఆవరణలో పార్టీ శ్రేణులు మొక్కలు నాటి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన సేవలను నాయకులు కొనియాడారు. దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని భగవంతుని కోరారు.
అనంతరం కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా బూరుగుపల్లిలో ఇటీవల గుండెపోటుతో మరణించిన సీనియర్ పాత్రికేయుడు గజ్జల శ్రీనివాస్ కుటుంబానికి మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున రూ.లక్షా60వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, మాజీ జెడ్పిటీసీ కొంకటి లచ్చిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీపి రెడ్డి కిషన్ రెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, సర్పంచ్ అనుముల భాస్కర్, నాయకులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి,కొంకటి శేఖర్, అక్కనపల్లి కరుణాకర్, మెడుతుల మల్లేశం, ముద్దం రవి, జంపుక ఆనంద్, కన్నం సాగర్, నల్లగొండ అనిల్, బోయిని రాజు, తొంటి మధు, బీ రమేష్, ఆరెపల్లి రాజు, కోటి, సంజీవ్, జగన్, హరీష్, కట్ట లింగయ్య, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.