రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్హాల్లో నిర్వహించే పట్టణ కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశానికి సిరిసిల్ల పట్టణంలోని నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.