Chintal Thana | చింతల్‌ఠాణా సర్పంచ్‌గా గెలిచిన మృతి చెందిన మురళి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
వేములవాడ మండలం చింతలఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి (మృతుని పేరు మురళి) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సోమవారం పరామర్శించారు.
Chintal Thana | వేములవాడ : వేములవాడ మండలం చింతలఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి (మృతుని పేరు మురళి) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సోమవారం పరామర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ పాల్గొన్న అభ్యర్థి, ఎన్నికల ఫలితాలకు కొద్ది రోజుల ముందు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
అయితే, గ్రామంలో ఆయన చేసిన సేవలు, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న నమ్మకంతో చింతలఠాణా ప్రజలు మరణించిన ఆయనకే భారీ మెజారిటీతో ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించారు. ఈ నేపథ్యంలో చింతలఠాణాకు సోమవారం చేరుకున్న కేటీఆర్, మరణించిన సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Chintal Thana
- KTR
- murali
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

