ఓదార్చి.. భరోసానిచ్చి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిరిసిల్లలో పర్యటించారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి వచ్చిన ఆయన, పలువురు బాధితులను పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని భరోసానిస్తూ ముందుకు సాగారు.
- సిరిసిల్లలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కేటీఆర్ పర్యటన
- చికిత్స పొందుతున్న పానీపూరి బాధితులకు పరామర్శ
- మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచన
- చిక్కాల అశ్విన్‌రావుకు నివాళి
రాజన్న సిరిసిల్ల, జూన్ 18(నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిరిసిల్లలో పర్యటించారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి వచ్చిన ఆయన, పలువురు బాధితులను పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని భరోసానిస్తూ ముందుకు సాగారు. రెండ్రోజుల క్రితం పానీపూరి తిని అస్వస్థతకు గురై సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
వైద్య సహాయం కోసం తాను ఉన్నానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇంకేమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకరావాలన్నారు. అంతకుముందు స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు అశ్విన్‌రావు ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్‌రావు హాజరయ్యారు. అశ్విన్‌రావు ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ టీవీ నారాయణ తల్లి వెంకటలక్ష్మి ఇటీవల మృతిచెందగా వెళ్లి పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

