కార్పొరేషన్, మార్చి 19 : కరీంనగర్లో ఈ నెల 23న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గంగుల కమలాకర్ అధ్యక్షతన కరీంనగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదివారం నిర్వహించే సమావేశానికి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరవుతారని తెలిపారు.
ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి, కాసరపు శ్రీనివాస్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.