రాజన్న సిరిసిల్ల, మే 5(నమస్తే తెలంగాణ)/ బోయినపల్లి : జమ్ము కశ్మీర్లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెం దిన జవాన్ పబ్బల్ల అనిల్ మృతి చెందడంపై శుక్రవారం మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో యువ జవాన్‌ను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే సుంకె పరామర్శ..
బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో జవాన్ అనిల్ కుటుంబ సభ్యులను చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం వారి ఇంటికి వెళ్లగా, తల్లిదండ్రులు, భార్యా పిల్లలు బోరున విలపించారు. ఎమ్మెల్యే వారిని ఓదార్చి కంటితడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెలీకాప్టర్ ఘటనలో అనిల్ మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటన విషయాన్ని మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో యినపల్లి వినోద్‌కుమార్, ఎంపీ జోగినపల్లి సం తోష్కుమార్ దృష్టికి తీసుకెళ్లానని, ప్రభుత్వ ప రంగా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పా రు. అంతే కాకుండా, వారు శనివారం జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉన్నదని తెలిపారు. కాగా, అనిల్ మృతితో ఆయన స్వ్రగ్రామం మ ల్కాపూర్, అత్తగారి ఊరు కోరెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సర్పంచ్ కోరెపు నరేశ్ తదితరులు ఉన్నారు.
నేడు మల్కాపూర్‌లో అంత్యక్రియలు
ఆర్మీ జవాన్ అనిల్ అంత్యక్రియలు ఆయన స్వ గ్రామం మల్కాపూర్‌లో శనివారం జరగనున్నా యి. అందుకు జిల్లా ఉన్నతాధికారుల నుం చి వచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఆర్మీ అధికారులు గ్రామాన్ని సందర్శించి, పరీశీలించారు. అంత్యక్రియలను ఆర్మీ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో చేయనున్నట్లు వారు కుటుంబ స భ్యులకు తెలిపారు. శుక్రవా రం రాత్రి మల్కాపూర్ గ్రామాన్ని వారు పూ ర్తిగా వారి కంట్రోల్ కి తీసుకుంటున్నట్లు తెలిసిం ది. ఇక్కడ ఆర్మీ అ ధికారి విక్రమ్‌సింగ్, సిబ్బంది ఉన్నారు. కాగా, సైనిక లాంఛనాల అనంతరం శనివారం అనిల్ మృతదేహం మల్కాపూర్‌కు చేరుకోనున్నది.