KTR | సిరిసిల్ల టౌన్, మే 18 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం సిరిసిల్లలో పర్యటించి పలు శుభకార్యాలకు హాజరయ్యారు. స్థానిక తెలంగాణ భవన్లో జరిగిన సమ్మెట పర్శరాములు కూతురు వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అక్కడి నుండి కే. కన్వెన్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ల ఫోరం జిల్లా మాజి అధ్యక్షుడు మాట్ల మధు సోదరుడు మాట్ల ప్రవీణ్ వివాహ వేడుకలలో పాల్గొన్నారు.
తరువాత లహరి కల్యాణ మండపంలో ఆవునూరు గ్రామానికి చెం సౌల రాజం కొడుకు వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఆక్కడే ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ కు తాటి మంజులు అందజేశారు. తంగళ్లపల్లి మండలం మల్లాపూర్ లో బీఆర్ఎస్ కార్యకర్త గొట్టే వంశీరెడ్డి వివాహ వేడుకలకు కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా గ్రంథాలయ మాజి చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సి చైర్ పర్సన్ జిండం కళ, బొల్లి రామ్మోహన్, కుంబాల మల్లారెడ్డి, అన్నారం శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం జిల్లా మాజి అధ్యక్షుడు మాట్ల మధు, తదితర నాయకులు పాల్గొన్నారు.