ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 4 : ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మలిదశ ఉద్యమ కాలంలో యాక్టివ్‌గా పని చేసిన గడ్డి నర్సయ్య గురువారం మృతి చెందగా సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ద్వారా శుక్రవారం సానుభూతి ప్రకటించారు.
నర్సయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నర్సయ్య మృతి పార్టీకి తీరని లోటు అని, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని పేర్కొన్నారు.