Krishnashtami | తిమ్మాపూర్,ఆగస్టు14: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ముందస్తుగా గురువారం నిర్వహించారు. విద్యార్థులు కృష్ణులు గోపికమ్మను వేషదారణలో అలరించారు.
ఉట్టి కోట్టే వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు ఆనందంగా గడిపారు. కృష్ణుని గొప్పతనాన్ని పాఠశాల కరస్పాండెంట్లు బర్మయ్య, జితేందర్ విద్యార్థులకు వివరించారు.