కోరుట్ల : పట్టణంలోని కోరుట్ల పబ్లిక్ స్కూల్‌కు చెందిన అల్లె హేమ ( Alle Hema ) జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఖోఖో ( Kho-Kho ) పోటీలకు ఎంపికైంది. ఇటీవల జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో ప్రతిభ చూపిన హేమ జాతీయ స్థాయి ( National level ) క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ గుజ్జేటి వెంకటేష్ తెలిపారు.
జనవరి 23 నుంచి 28 వరకు రాయచూర్‌లో జరిగే జాతీయ శిక్షణ శిబిరానికి హజరుకానుందని పేర్కొన్నారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించే జాతీయ స్థాయి ఖోఖో క్రీడా పోటీల్లో ఆమె పాల్గొంటుందని తెలిపారు. ప్రతిభచూపి జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.