MLA Sanjay | మెట్పల్లి, ఏప్రిల్ 5: రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి 12వ ర్యాంకు దక్కింది. ఈ మేరకు ఆ సంస్థ సర్వే జాబితాను శనివారం విడుదల చేసింది. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ కల్వకుంట్ల సందీప్ 2023 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మొదటిసారిగా కోరుట్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఆయన ప్రజల తో మమేకమవుతూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తమ ఎమ్మెల్యే పనితీరుపై రాష్ట్రస్థాయిలో 12వ స్థానం రావడం పట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.