చెట్ల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
విద్యుత్ లైన్ల మరమ్మతుల సందర్భంగా చెట్లను నరికివేయకుండా సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ లైన్ల క్లియరెన్స్ పనుల్లో చెట్లను విచక్షణారహితంగా తొలగించడం, కొమ్మలు నరికివేడయం వల్ల పచ్చదనంపై తీవ్ర ప్రభావం పడుతున్నదని వివరించారు.
- కలెక్టర్ సత్యప్రసాద్కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల వినతి
- కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
మెట్పల్లి, జూన్ 15 : విద్యుత్ లైన్ల మరమ్మతుల సందర్భంగా చెట్లను నరికివేయకుండా సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ లైన్ల క్లియరెన్స్ పనుల్లో చెట్లను విచక్షణారహితంగా తొలగించడం, కొమ్మలు నరికివేడయం వల్ల పచ్చదనంపై తీవ్ర ప్రభావం పడుతున్నదని వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా కొనసాగించడం, చెట్ల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అవసరమైన చోట్ల చెట్లను పూర్తిగా తొలగించకుండా కొమ్మలను తొలగించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, జీవ వైవిధ్యం, భూ గర్భజలాల పరిరక్షణలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని, చెట్ల సంరక్షణతోపాటు విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సమతుల్యంగా కొనసాగాలని పేర్కొన్నారు. చెట్ల తొలగింపు పనులు చేపట్టే ముందు అటవీశాఖతో సమన్వయం చేసుకోవాలని, పచ్చదనాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

