గోదావరిఖని, జనవరి 18: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం సిగ్గుచేటని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? కేసులా బనాయిస్తారా..? అని ప్రశ్నించారు. సాగు భూములకు నీరివ్వాలలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే దాడులకు పాల్పడుతారా..? అని ధ్వజమెత్తారు.
దాడిని ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు. కేసులకు, బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని స్పష్టం చేశారు, రవిశంకర్ ఇంటిపై దాడిని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఖండించాలని కోరారు. దాడికి ప్రోత్సహించిన రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మారుతి, కుమ్మరి శ్రీనివాస్, అచ్చెవేణు, నీరటి శ్రీనివాస్, రాకం దామోదర్, తిమోతి, జక్కుల తిరుపతి, నీరటి శ్రీనివాస్, సట్టు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్, కిరణ్, వెంకన్న, ఓదెలు, వెంకటేశ్, రామరాజు ఉన్నారు.