Vemulavada | చట్టసభలలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలి : కొండ దేవయ్య
మున్నూరు కాపులు చట్టసభలలో మెజార్టీ స్థానాలు దక్కించుకునే విధంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు.
వేములవాడ, ఏప్రిల్ 15: మున్నూరు కాపులు చట్టసభలలో మెజార్టీ స్థానాలు దక్కించుకునే విధంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. బుధవారం వేములవాడలోని రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆయన ఘనంగా సన్మానించి సత్కరించి మాట్లాడారు. రాష్ట్రంలోని 25 మున్సిపాలిటీలలో కాపులు సత్తా చాటి చైర్మన్ స్థానాలను దక్కించుకున్నారని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లోను దాదాపు 1000 మంది గెలుపొందారున్నారు.
రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పెరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా రిజర్వేషన్లను అందిపుచ్చుకొని చట్టసభలలో మెజార్టీ స్థానాలు దక్కించుకునే విధంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఐక్యమత్యంతో మరింత రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు బొప్ప దేవయ్య, నామాల పోచెట్టి, దేవయ్య, చిలుక రమేష్, కోయినేని బాలయ్య, మారం కుమార్, బొందిల నరసయ్య, కొండ కనకయ్య, కొండ దేవయ్య, వారాల దేవయ్య, కూరగాయల కొమరయ్య తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

