లండన్: భారతీయ సంతతి వ్యక్తి, బీహార్‌లో పుట్టిన కనిష్క నారాయన్(Kanishka Narayan).. బ్రిటన్ ప్రభుత్వంలో తొలి ఏఐ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కృత్రిమ మేధకి తొలిసారి బ్రిటన్‌లో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. అయితే ఆ మంత్రి పదవిని బీహార్‌లో పుట్టి, బ్రిటన్‌కు వలస వెళ్లిన కనిష్కకు దక్కడం గమనార్హం. ఆయన ముజాఫర్పూర్లో జన్మించారు. 12 ఏళ్ల వయసులో ఆయన కార్డిఫిక్కు తమ పేరెంట్స్‌తో వెళ్లిపోయారు. అయితే యూకే ఏఐ మంత్రిగా కనిష్క నియామకాన్ని గూగుల్ ఏఐ చీఫ్ డెమిస్ హస్సాబిస్ స్వాగతించారు. కనిష్కకు కంగ్రాట్స్ చెప్పిన హస్సాబిస్ తన ఎక్స్ అకౌంట్లో ప్రశంసించారు.
కనిష్క నారాయన్ చిన్ననాటి నుంచి చదువుల్లో చురుకు. ఈటన్ కాలేజీలో ఆయన విద్యను అభ్యసించారు. స్కాలర్‌షిప్‌పై స్టడీ పూర్తి చేశాడు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డ్రిగ్రీ పొందారు. ఫిలాసఫీ, పోలిటిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో విద్యను పూర్తి చేశారు. అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ చదివారు. ఆయన పేరెంట్స్ ఇమ్మిగ్రాంల్స్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సేవలో పాల్గొన్నారు.లేబర్ పార్టీలో ఆయన జతకలివారు. వేల్స్‌లోని గ్లామోర్గన్ నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా 2022లో నారాయన్ పార్లమెంటరీ కెరీర్ మొదలైంది. ఆ ఏడాది జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో ఆయన ఓడిపోయారు. కానీ ఆయన పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో సైన్స్, ఇన్నోవేషన్ టెక్నాలజీ శాఖలో పార్లమెంటరీ సెక్రటరీగా చేశారు. ఈ వారం ఆయనకు కొత్త ప్రమోషన్ దొరికింది. బ్రిటన్‌కు తొలి ఏఐ శాఖ మంత్రిగా ఆయన్ను నియమించారు.
Congratulations @KanishkaNarayan on your new role as UK’s AI Minister in the Cabinet, great news for the UK AI ecosystem! https://t.co/sTGKD4bT0P
— Demis Hassabis (@demishassabis) July 23, 2026