National level basketball tournament | జగిత్యాల, సెప్టెంబరు 1 : ఇటీవల గద్వాల జిల్లా ఉత్తనూర్ లో జరిగిన రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో 75 జూనియర్ ఛాంపియన్ షిప్ టీంకి మెరుగైన ప్రతిభ కనబరిచిన కేజీఆర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వడ్డేపల్లి సుధన్వి జాతీయ స్థాయికి ఎంపికైంది. జగిత్యాల జిల్లా నుంచి జాతీయస్థాయికి తమ విద్యార్థి ఎంపిక కావడం ఆనందంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి విద్యార్థిని అభినందించారు.
జాతీయ స్థాయి పోటీలు సెప్టెంబర్ 2 నుంచి 9వరకు పంజాబ్ లోని లూథియానా లో జరగనున్నాయి. స్కిర్మీస్ బాస్కెట్ బాల్ అకాడమీ ఫౌండర్ (skirmish basketball academy) శ్రీరామ్, సంపత్, విజ్ఞాన్, ఇచ్చిన కోచింగ్ లో ప్రతిభను కనబరిచి నేషనల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ టీంకు సెలక్ట్ అయ్యానని విద్యార్థిని పేర్కొన్నారు. జగిత్యాల నుంచి సుధన్వి నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొననుంది. విద్యార్థి నేషనల్ టోర్నమెంట్ కు ఎంపిక కావడంతో పలువురు అభినందించారు.