కేసీఆర్ సభను విజయవంతం చేయాలి
జగిత్యాలలో ఈనెల 20న నిర్వహించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించాలని నిర్దేశం చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ముఖ్యనాయకులతో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
- ఈ నెల 20న జగిత్యాల సభకు భారీగా తరలించాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
- కరీంనగర్లో సన్నాహక సమావేశం
- హాజరైన ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జిలు
కరీంనగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : జగిత్యాలలో ఈనెల 20న నిర్వహించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించాలని నిర్దేశం చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ముఖ్యనాయకులతో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏ నియోజకవర్గం నుంచి ఎంత మందిని తరలించాలనే దానిపై ఆయన ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగించారు. జన సమీకరణపై పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్నారని చెప్పారు. జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని, కరీంనగర్ నియోజకవర్గం నుంచి 5 వేల మందిని, ఉమ్మడి జిల్లా పరిధిలోని మిగతా ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందిని తరలించాలన్నారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితల సతీశ్‌కుమార్, పుట్ట మధూకర్, సుంకె రవిశంకర్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Karimnagar4
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS meeting
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

