BRS | డిజిటల్ సభ్యత్వంపై కేసీఆర్ నజర్.. నియోజకవర్గాల వారీగా ఇంఛార్జిల నియామకం..!
రాజన్న సిరిసిల్ల, మే 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని నిర్ణయించిన అధినేత కేసీఆర్(KCR) ఆ దిశగా దృష్టి సారించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇంఛార్జిలకు బాధ్యతలు అప్పగించారు.
రాజన్న సిరిసిల్ల, మే 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని నిర్ణయించిన అధినేత కేసీఆర్(KCR) ఆ దిశగా దృష్టి సారించారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల్లో డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుండగా.. కేసీఆర్ ఇంఛార్జిలను నియమించారు. డిజిటల్ సభ్యత్వ నమోదును వేగవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇంఛార్జిలకు బాధ్యతలు అప్పగించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గానికి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జ్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌లను కేసీఆర్ నియమించారు. తమను ఇంచార్జిలుగా తీసుకున్నందుకు ఉమ, ప్రవీణ్‌లు కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ ఇంఛార్జిగా కొండూరు
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావును కరీంనగర్ నియోజకవర్గానికి సభ్యత్వ నమోదు ఇంఛార్జ్ గా కేసీఆర్ నియమించారు. బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను నిజామాబాద్ జిల్లాలోని భాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంఛార్జీగా ఎంపికయ్యారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కొండూరు, ఆగయ్యలను పార్టీ సభ్యత్వ నమోదు ఇంఛార్జిలుగా నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

