Chemist and Druggist Association | మంథని, మే 15: మంథని మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెండో సారి క్యాతం కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని లో గురువారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా నూక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చింతపండు రాజు, కోశాధికారిగా కనుకుంట్ల పురుషోత్తం, అడిషనల్ సెక్రటరీగా ఆరే కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అరకాల కోటేశ్వర్, సలహాదారుగా ఎం. శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికలు జిల్లా క్రిమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మామిడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, కోశాధికారి సతీష్ ల నేతృత్వంలో జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన మందులను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించరాదని. డూప్లికేట్ మందుల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.
వ్యాపార పరమైన సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే జిల్లా యూనియన్ వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్, మెడికల్ దుకాణాల యజమానులు జె ఎస్ రెడ్డి. ఇల్లందుల రాము, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలాల కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు జిల్లా యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.