Kgbgv student | సారంగాపూర్ : మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో నర్ర మానస 955 మార్కులు సాధించి రాష్ట్ర కేజీబీవీలలో సీఈసీలో మూడో స్థానంలో నిలిచారు. సారంగాపూర్ మండల కేంద్రంలో కేజీబీవీలో 2023 నుండి జూనియర్ కళాశాల తరగతులు ప్రారంభించారు. 2023-2024 విద్యాసంవత్సరం లో మొదటగా ఇంటర్ మొదటి సంవత్సరం ప్రారంభం కాగా 2024 సంవత్సరంలో ద్వితీయ సంవత్సరంగా అప్గ్రేడ్ అయింది. 2023 లో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 11 మంది 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ విద్యా సంవత్సరం లో ఇంటర్ సెకండ్ ఇయర్ లో 11 మంది 100 శాతం ఉతీర్ణత సాధించారు. ఎన్ మానస విద్యార్థినీ సెకండ్ ఇయర్ లో 955 మార్కులు సాధించి రాష్ట్ర కేజీబీవీలలో CEC లో మూడో స్థానం లో నిలింది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన మానసను పాఠశాల ఎస్వో వీణ, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్ర రాంచందర్ రెడ్డి, నాయకులు, గ్రామస్తులు అభినదించారు.