చందుర్తి, జనవరి 5: ఉమ్మడి కరీంగనర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను చందుర్తి మండలం మల్యాలలో ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల నిర్వహణకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆవిష్కరించారు.
వాలీబాల్ యూత్ అసోసియేషన్ మల్యాల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు కేసీఆర్ కప్‌తోపాటు నగదు బహుమతులు అందిస్తామని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు తెలిపారు. పూర్తి వివరాల కోసం వినయ్ (77319-28884), అభి (86884-93277, 70953-53096)ని సంప్రపదించాలని ఆయన సూచించారు.