Karimnagar | కమాన్చౌరస్తా, జూలై 27: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం ఉదయం గణపతి హోమం అనంతరం 108 కలశాలతో అయ్యప్ప స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వాముల ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణక్య, శ్రీనివాస శర్మ, మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, దేవాలయ కార్యనిర్వహణ అధికారి కే కాంతరెడ్డి పాల్గొని పూజల్లో భాగస్వాములయ్యారు. ఇక్కడ ధర్మకర్తల మండలి సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్, కవిత, కృష్ణ, ఆనంద రెడ్డి, సిబ్బంది, నాయకులు పొన్నం శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.