కలెక్టరేట్, ఆగస్టు 16: కరీంనగర్ పట్టణాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాగర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, కలెక్టర్‌తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కోర్టు భవనానికి సమీప దూరంలో అడ్వకేట్ల నివాస సముదాయం కోసం నెలరోజుల్లో స్థలాన్ని గుర్తించనున్నట్లు తెలిపారు. అడ్వకేట్లకు హెల్త్ కార్డుల జారీకి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో యినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడు తూ.. కరీంనగర్లో బహుళ అంతస్థుల భవన సముదాయ నిర్మాణ పరిపాలన అనుమతుల కోసం కృషిచేస్తానని తెలిపారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ వై.సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఆర్డీవో ఆనంద్‌కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు.