కరీంనగర్ రూరల్, మార్చి 29: వైద్య రంగంలో డాక్టర్లకు ప్రాక్టికల్ జ్ఞానం చాలా అవసరమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. నగునూర్‌లోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థలో వైద్య విద్యార్థుల కోసం ‘ప్రాణా-2026’ పేరిట రెండో రోజు ఆదివారం అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి సీపీ హాజరై, మాట్లాడారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మెడికల్ విద్యార్థులకు ప్రాక్టికల్ జ్ఞానం ఎంతో అవసరమన్నారు.
ఇలాంటి సమావేశాలు వారి భవిష్యత్‌కు మేలు చేస్తాయన్నారు. ఇక్కడ ఉన్న ఆధునిక పరికరాలు విద్యార్థుల శిక్షణకు ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ హాసిని మాట్లాడుతూ, ప్రాణా-2026 అంటే మూడు (జీవశక్తి, ఉత్సాహం, లక్ష్మం) విలువలని.. వీటిని మీరందరూ ఆచరణలో చూపించాలని సూచించారు. ఇక్కడ నేర్చుకున్న సంబంధాలు, జ్ఞానం, టెక్నాలజీ భవిష్యత్తులో మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు ఉపయోగపడాలన్నారు.
అనంతరం వైద్య విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను డైరెక్టర్ హసిని, సీపీ అందించారు. ఈ సందర్భంగా సీపీని డైరెక్టర్ హాసిని సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జాన్ ఇజ్రాయెల్, వైద్య సంస్థ సీఏవో రామచంద్రర్‌రావు, మెడికల్ సూపరింటెండెంట్ సీఎన్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ కిషన్‌రెడ్డి, రిజిస్ట్రార్ కమ్ అడ్మిన్ ప్రసాద్‌రావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సీహెచ్ అమిత్‌కుమార్, (పీడీయాట్రిక్స్ హెచ్‌వోడీ) ప్రణయ్, సంధ్య, టీకేకే నాయుడు, తదితరులు పాల్గొన్నారు.