సైదాపూర్, ఫిబ్రవరి 25: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆరుగురు లబ్ధిదారులకు రూ. 3 లక్షల 8 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే, ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన వారికి రాష్ట్ర సర్కారు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం చేస్తూ, అండగా ఉంటున్నదని పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ ఏర్పాటులో భాగంగా ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు అందిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ సమయంలో ప్రజలకు మెరుగైన సేవలందించారని ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, టీఆర్ఎస్ నాయకుడు చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచులు కాయిత రాములు, కొండ గణేశ్, అబ్బిడి పద్మ-రవీందర్‌రెడ్డి, బత్తుల కొమురయ్య, బొడిగ పద్మజ-కొమురయ్య, ఆవునూరి పాపయ్య, కొత్త రాజిరెడ్డి, తొంట కాంతమ్మ, పైడిమల్ల సుశీల-తిరుపతిగౌడ్, రేగుల సుమలత-అశోక్, ఎంపీటీసీలు బద్దిపడిగ అనితారవీందర్రెడ్డి, ఇందిర-సుధీర్, భాగ్య, ఓదెలు, నాయకులు ప్రవీణ్, రాజిరెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, వీరేశం, ఐలయ్య, రజినీకాంత్, మోహన్‌రావు, భిక్షపతి, శ్యాం, రమేశ్‌నాయక్, నరేశ్, మహిపాల్‌సింగ్, హరీశ్, సురేశ్, శ్రావణ్ పాల్గొన్నారు.