కరీంనగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆగ్రో ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన గౌరిశెట్టి మునీందర్ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. మూడేళ్లకోసారి అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో భాగంగా తాజాగా, యాదాద్రి జిల్లాలో సమావేశం జరిగింది. ఇప్పటికే రెండు సార్లు అధ్యక్ష పదవిలో కొనసాగిన మునీందర్ అసోసియేషన్ పరంగా అందించిన సేవలు, ప్రభుత్వానికి-డీలర్లకు మధ్య అనుసంధానంగా వ్యవహ రించిన తీరు, సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న చర్యల వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న ఆసోసియేషన్ సభ్యులు.. మునీందర్ను మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నమ్మకం ఉంచి మరోసారి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన మునీందర్ డీలర్లకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా వ్యవసాయరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని, 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతోపాటు.. అతి తక్కువ సమయంలో ప్రపంచం మెచ్చే ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయ రంగానికి కొత్త వన్నెతెచ్చారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో రాష్ట్రంలో వ్యవసాయరంగం వెలుగొందుతున్న తరుణంలో.. కొంతమంది బయటివ్యక్తులు నకిలీ సీడ్స్ విక్రయించేందుకు పన్నాగం చేస్తున్నారని, ఇలాంటి వారిపట్ల డీలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. నకిలీ విక్రయదారులకు లైసెన్సులు ఉండవని, అమ్ముకొని వెళ్లిపోతారని, స్థానికంగా ఉండేది మా త్రం లోకల్ డీలర్లే అని, ఈ నేపథ్యంలో నకిలీ సీడ్స్ విక్రయించే వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం స్థానిక డీలర్లకే అధికంగా ఉందని సూచించారు. తద్వా రా మంచి పేరు రావడంతో పాటు.. నకిలీ దారుల ఆటకట్టించవచ్చన్నారు. నకిలీ విక్రయదారులను గుర్తించి ఎక్కడికక్కడ ప్రభుత్వానికి, అధికారులకు పట్టించాలని కోరారు. వ్యవసాయ రంగం మరింత విస్తృతం కావడానికి డీలర్లుగా మనవంతు సహకారాన్ని అందించాలని సూచించారు.