రాంనగర్, జూన్ 28: ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని డ్రీం జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఆర్ భరద్వాజ్ 462, ఎం కార్తీక్‌రెడ్డి 459, ఆర్ రాహుల్ 459, బీ ప్రనంజయ్ 459, మారం అజయ్ 470, ఏ వినయ్ 454, ఆర్ అరవింద్ 454, పీ చరణ్ 449, ఎన్ శ్రీనివాస్ 449 మార్కులు సాధించారని కళాశాల డైరెక్టర్ ఎన్ వెంకటరెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు డిఫెన్స్‌తో పాటు, అనేక రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులను కళాశాల డైరెక్టర్ ఎన్ వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్ బద్దం నర్సింహారెడ్డితో పాటు అధ్యాపక బృందం అభినందించారు.
రుక్మాపూర్ మోడల్ విద్యార్థుల ప్రతిభ
చొప్పదండి, జూన్ 28: ఇంటర్ ఫలితాల్లో మండలంలోని రుక్మాపూర్ ఆదర్శ మాడల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరంలో 56శాతం విద్యార్థులు, రెండో సంవత్సరంలో 86శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపాల్ కోల రమేశ్ తెలిపారు. ఫస్టియ ర్ ఎంపీసీలో కే శ్రీనిత 463, బైపీసీలో పీ రేష్మ 431, బీ స్రవంతి 425, సీఈసీలో బీ సుష్మిత 459మార్కులు సాధించారని పేర్కొన్నారు. సెకండియర్ బైపీసీలో పీ పావని 964, సీఈసీలో లిఖిత 936, ఎస్.కిరణ్ 933 మార్కులు సాధించినట్లు తెలిపారు.
‘శ్రీచైతన్య’ విద్యార్థుల ప్రభంజనం
చొప్పదండి శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో గోస్కుల శ్రీనిజ 467, కస్తూరి సహన 461, చెట్టిపల్లి ప్రవళిక 460, బైపీసీలో ఎరవేణి ప్రవళిక 428, సుప్రియ 424, సీఈసీలో బొడిగె అపర్ణ 451, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో కోలపూరి రోజా 959 మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రత్నాకర్‌రెడ్డి తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ గుండేటి వెంకటరమణ, డైరెక్టర్ వెంగల హరిప్రసాద్, పంతగాని అనిల్ పాల్గొన్నారు.
రేకుర్తి మైనార్టీ కళాశాలలో ఉత్తమ ఫలితాలు
కొత్తపల్లి, జూన్ 28: ఎంపీసీ ఫస్టియర్ ఫలితాల్లో రేకుర్తి మైనార్టీ గురుకుల ఆశ్రమ జూనియర్ కళాశాలకు చెందిన సానియా 464, బైపీసీలో అర్షియా అంజూమ్ 432 మార్కులు సాధించారు. ఎంపీసీ సెకండియర్‌లో యాస్మిన్ ఫర్హా 971 మారులు సాధించారు. ప్రిన్సిపాల్ మోనిక సోనీ విద్యార్థులందరికీ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
మరోసారి సత్తా చాటిన ఢిల్లీ కళాశాల
కొత్తపల్లి, జూన్ 28: మండలంలోని ఢిల్లీ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోమారు ప్రతిభను చాటి రాష్ట్రస్థాయి మార్కులు సాధించినట్లు కళాశాల చైర్మన్ కొత్త సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో ఎం.ప్రహీత్ వీరాజ్రెడ్డి 461, గడ్డం విష్ణు 461, సుధవేని రాజేశ్ 460, దొంతుల అనిత్‌కుమార్ 459, యాగండ్ల మహేశ్ 459, బొద్దుల దీపక్ స్వరాజ్ 458, అత్తె వరుణ్ 456, గంట్ల మణిదీప్‌రెడ్డి 456, తృతీ ఆదిత్య 455, మూతే రాకేశ్ 455, బోగి శరత్‌కుమార్ 453, బంగ్ల త్రినాథ్‌రెడ్డి 451 మార్కులు సాధించి సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ అభినందించారు.
మెరిసిన తేజస్విని విద్యార్థులు
గంగాధర, జూన్ 28: మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మండలంలోని తేజస్విని జూనియర్ కళాశాల, ప్రభుత్వ మోడల్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తేజస్విని కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో శ్రీజ 460, మేఘన 453, సాయిభాస్కర్ 451 మార్కులు, బైపీసీలో పూజిత 434, ఆస్మా 372 మార్కులు, సీఈసీలో సుమయ 464, వైష్ణవి 450, సంధ్య 439, దీపిక 425, వర్షిత 414 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో మనీశ్ 963, రజిత 907, బైపీసీలో స్రవంతి 964, సౌమ్య 945 మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ ప్రతాపరావు, ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్, డైరెక్టర్ వెంకటేశ్వర్రావు అభినందించారు.
మైనార్టీ గురుకుల విద్యార్థుల సత్తా
కరీంనగర్ రూరల్, జూన్ 28: మొగ్దుంపూర్ మైనార్టీ బాలుర గురుకుల కళాశాల-3లో ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లో రేవళి అజయ్ 492 మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పోరండ్ల చంద్రమోహన్ తెలిపారు. మెడికల్‌ల్యాబ్ టెక్నీషియన్లో ఎండీ రషీదుద్దీన్ 465 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను అభినందించారు.