హుజూరాబాద్‌టౌన్, జూన్ 28: ఇంటర్మీడియట్ బోర్డ్ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో డివిజన్లోని ఆయా కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. పలువురు ఉత్తమ మార్కులు సాధించి సత్తా చాటగా, ఆయా కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు అభినందించారు. హుజూరాబాద్ పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానం సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ మారబోయిన వేణుమాధవ్, కళాశాల డైరెక్టర్లు సీహెచ్ రాజేశ్వర్‌రెడ్డి, కే ప్రవీణ్‌రెడ్డి, జే ప్రకాశ్‌రెడ్డి, కే తిరుపతిరెడ్డి తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మారులకు ఏ నందిత 467 మారులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అలాగే 466 మారులతో జీ ప్రజ్ఞ్ఞ, జే సాత్విక, వై నిఖిల్ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారని తెలిపారు.
అలాగే బైపీసీ విభాగంలో సమ్రిద్ 440 మారులకు గానూ 436 సాధించి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం, సీఈసీ విభాగంలో సరోజ్వర్ధన్ 500 మారులకు గానూ 481 సాధించి హుజూరాబాద్ డివిజన్లో మొదటి స్థానంలో నిలిచారని వెల్లడించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బైపీసీ విభాగంలో 1000 మారులకు గానూ పీ అన్విత 988 సాధించి డివిజన్ స్థాయిలో మొదటి స్థానంలో, ఎంపీసీ విభాగంలో పీ శార్వాణి 985 మారులతో, సీఈసీ విభాగంలో ఎం సింధు 894మారులతో డివిజన్లో ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. ఇంతటి విజయాన్ని సాధించిన ఆయా విద్యార్థులందరినీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుమాధవ్, కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి, స్వీట్లు తినిపించి అభినందించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించి అత్యధిక మారులు సాధించిన విద్యార్థినీవిద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల, అధ్యాపకులు అభినందించారు. బైపీసీ విభాగంలో శనిగరం శివ 909 మారులు, ఎంపీసీలో చీకటి అభినయ్ 904 మారులు, సీఈసీలో గుండ స్రవంతి 849 మారులు సాధించారని తెలిపారు. అలాగే మొదటి సంవత్సరంలో కూడా బైపీసీలో మండ స్రవంతి 399 మారులు, ఎంపీసీలో అరవింద్ 345 మారులు, సీఈసీలో తూర్పాటి రజిత 350 మారులు, హెచ్ఈసీలో అంబాల రమ్య 435 అత్యధిక మారులు సాధించారన్నారు.
రాష్ట్ర స్థాయిలో విస్డమ్ విద్యార్థుల సత్తా
పట్టణంలోని విస్డమ్ వొకేషనల్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎలక్ట్రీషియన్ విభాగంలో మణికంఠ 500మార్కులకు గానూ 486, వినోద్ 425, ఎంపీహెచ్‌డబ్ల్యూలో స్వాతి 473 మార్కులు, కావేరి 470, ఎంఎల్‌టీలో రాహుల్ 454, అగ్రికల్చర్లో చందు 440 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీహెచ్‌డబ్ల్యూలో పల్లవి 1000 మార్కులకు గానూ 913, కల్యాణి 907, ఎంఎల్‌టీలో రాజేశ్ 868, సాయి చరణ్ 841 ఏసీపీ విభాగంలో విజేందర్‌రావు 915, రవికుమార్ 838, ఈటీలో సందీప్ 831, రాహుల్ 807 మార్కులతో సత్తా చాటారు. రాష్ట్ర స్థ్ధాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ కూర విజేందర్‌రెడ్డి, కరస్పాండెంట్ మల్లారెడ్డి, చైర్మన్ విజయారవీందర్, వైస్ చైర్మన్ అరుణాప్రభాకర్, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి పుష్పగుచ్ఛాలను అందజేసి అభినందించారు. ఇక్కడ అధ్యాపకులు మంజుల, రాజేందర్, పరశురాంతో పాటు విద్యార్థులు ఉన్నారు.
కాకతీయ విజయకేతనం
జమ్మికుంట రూరల్, జూన్ 28: పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మండల స్థాయిలో అధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో రచ్చ సౌమ్య 470 మార్కులు, బైపీసీ ప్రథమ సంవత్సరంలో దబ్బెట సంజన 426 మార్కులు, సీఈసీలో పంజాల అర్చన 458 మార్కులు, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో పర్లపల్లి వాత్సల్య 964, సీఈసీలో వాసాల అభిలాష 857, ఎంపీసీలో 937 మార్కులు సాధించారు. ప్రతిభచూపిన విద్యార్థులను కాకతీయ విద్యాసంస్ధల చైర్మన్ సుధాకర్‌రావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా విద్యాసంస్థలను నడుపుతున్నామని చెప్పారు. ఇక్కడ అధ్యాపకులు ఉన్నారు.
సోమారం మోడల్ స్కూల్లో..
మండలంలోని సోమారం మోడల్ స్కూల్లో 96 మంది ఫస్టియర్ విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కాగా, 45మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 61మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 40మంది పాస్ అయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో శ్రీయ 943 మార్కులు, బైపీసీలో కావ్య 945 మార్కులు, సీఈసీలో నవ్య 849 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో నవ్యశ్రీ 459మార్కులు, బైపీసీలో శ్రీలత 366 మార్కులు, సీఈసీలో భవాని 474 మార్కులతో సత్తా చాటారు.
ఘన్ముక్ల మోడల్ సూల్లో ..
ఇంటర్ ఫలితాల్లో ఘన్ముక్ల మోడల్ సూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 95శాతం, ద్వితీయ సంవత్సరంలో 98శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో పోతరవేని కరుణశ్రీ 460మార్కులు, బైపీసీ ప్రథమ సంవత్సరంలో మూగల అనూష 419 మార్కులు, సీఈసీ ప్రథమ సంవత్సరంలో పోలు రాకేశ్ 463మార్కులు, ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో బుర్ర అక్షిత 926 మార్కులు, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఈ అక్షయ 962, సీఈసీ ద్వితీయ సంవత్సరంలో ఎన్ కీర్తన 820 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.