కొత్తపల్లి, జూన్ 21: ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ సూచించారు. జిల్లా యోగా సంఘం, మానేరు విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. యోగా సాధనతో సర్వరోగాలను నయం చేసుకోవచ్చని, ప్రతి ఒక్కరూ నిత్యం గంటపాటు యోగా సాధన చేయాలని సూచించారు. యోగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ యోగా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకాలు సాధించినట్లు తెలిపారు. మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ, యోగా సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా విద్యలో రాణిస్తారన్నారు.
2021-22 సంవత్సరానికి గాను జిల్లాలో యోగా క్రీడల్లో పలు కేటగిరిల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించిన యోగా క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో కే రాజవీరు, జిల్లా యువజన అధికారి ఎం వెంకటరాంబాబు, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి కనకం సమ్మయ్య, మానేరు విద్యా సంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డి, యోగా కోచ్‌లు కిష్టయ్య, ప్రదీప్, ఉదయ్, రామకృష్ణ, మల్లిక తదితరులు పాల్గొన్నారు. అలాగే, పారమిత పాఠశాలలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యా సంస్థల అధినేత ఇనుగంటి ప్రసాదరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ప్రసూన, రశ్మిత, వినోద్‌రావు, రాకేశ్, అనూకర్‌రావు, వీయుఎం ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపాల్ వీ నిరంజన్ యోగా విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అంబేద్కర్ స్టేడియంతో పాటు సాయి మానేరు పాఠశాలలో జరిగిన యోగా వేడుకల్లో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన ధృతి, శృతిజలు ప్రతిభ చూపగా, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ బహుమతులు ప్రదానం చేశారు.
కమాన్‌చౌరస్తా, జూన్ 21: జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించగా, ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ లాల్ హాజరై మాట్లాడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ సూల్ ఆఫ్ జెన్ నెక్ట్స్‌లో విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి ఒకరూ యోగా సాధన చేయాలని సూచించారు. యోగాసానాల ఆధారంగా రూపొందించిన పాటల సీడీని ఆవిషరించారు. వివేకానంద, అద్విత పాఠశాలలో ప్రజ్ఞాభారతి, వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజులుగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యోగా డే సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య మాట్లాడారు.
ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు నిరంజనాచారి, ప్రధాన కార్యదర్శి మందల నగేశ్ రెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, సముద్రాల నాగేశ్వరరావు, కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, అద్విత పాఠశాల డైరెక్టర్ సౌగాని అనుదీప్, ఏవో తుంగాని సంపత్, కుమ్మరికుంట సుధాకర్ పాల్గొన్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో యోగా గురువు విశ్వనాథ్ పలు సూచనలు చేశారు. ఇక్కడ శ్రీనివాస్‌గౌడ్, బల్మూరి కరుణాకర్ రావు, కోల అన్నారెడ్డి, గుర్రాల మహేశ్వర్ రెడ్డి, ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థినులతో యోగాసానాలు వేయించారు. విశ్రాంత పీడీ జితేందర్, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గోపీకృష్ణ, జే సతీశ్, కే సతీశ్, సంపత్‌కుమార్, ఏవో శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్‌నగర్‌లోని బ్లూబెల్స్ పాఠశాల, వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహించిన యోగా వేడుకలు అలరించాయి.
ఓయాసిస్ ఫెర్టిలిటి సెంటర్లో..
విద్యానగర్, జూన్ 21: నగరంలోని ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లో యోగా దినోత్సవం నిర్వహించారు. డాక్టర్ జిగ్నా తమగొండ మాట్లాడుతూ, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. యోగా చేయడంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లో నిత్యం యోగా సాధన, శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.