తెలంగాణచౌక్, జూన్ 18: ప్రత్యేకమైన రోజుల్లో స్పెషల్ ఆఫర్లు ఇస్తున్న ఆర్టీసీ ఫాదర్స్‌డే సందర్భంగా ప్రత్యేక కానుకను ప్రకటించింది. ఐదేండ్లలోపు పిల్లల తండ్రులకు అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని సూచించింది. పిల్లలతో బస్సులు ఎక్కే తండ్రులకు టికెట్ తీసుకోవద్దని కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని కరీంనగర్ ఆర్ఎం ఖుస్రోఖాన్ శనివారం తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.