శంకరపట్నం, జూన్ 17 : అర్హులందరికీ దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని మొలంగూర్ పరిధిలోని గుడాటిపల్లె హనుమాన్ ఆలయ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో శుక్రవారం పాల్గొన్నారు. తిరిగొస్తుండగా, మొలంగూర్ శివారులో ఉపాధి పనులు పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న పలువురు మహిళలు కనిపించారు. వెంటనే ఎమ్మెల్యే వాహనం దిగి వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనుల్లో కూలి గిట్టుబాటు కావడం లేదని, పెన్షన్లు రావడం లేదని, ఇండ్లు రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఉపాధి పనుల్లో కూలీలకు కూలి గిట్టుబాటు అయ్యేలా చూడాలని, వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. త్వరలో అర్హులందరికీ ఇండ్లు, పింఛన్లు వస్తాయని భరోసా ఇచ్చారు. జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, సీనియర్ నాయకులు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, మోరె శ్రీనివాస్, మేడుదుల ఐలయ్య, నాంపల్లి శంకర్, మహిళా కూలీలు ఉన్నారు.
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
మానకొండూర్ రూరల్, జూన్ 17 : మానకొండూర్ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులను శుక్రవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. వీటిలో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జడ్పీటీసీ శేఖర్ గౌడ్, నాయకులు రావుల రమేశ్, రాచకట్ల వెంకట స్వామి, ముస్లిం పెద్దలు, గ్రామస్తులున్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్ కొడూరి రాజు తండ్రి కొడూరి పోచయ్య, కందుకూరి భూమ య్య ఇటీవల మృతి చెందారు. వీరి కుటుంబాలను ఎమ్మెల్యే ర సమయి బాలకిషన్ పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ శేఖర్ గౌడ్, నాయకులు రావుల రమేశ్, శ్యాంసన్, వెంకటస్వామి, కిరణ్ ఉన్నారు.
పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే
గన్నేరువరం, జూన్ 17 : మండలంలోని గునుకుల కొండాపూర్ అనుబంధ గ్రామం చొక్కల్లపల్లిలో ముదిరాజ్‌లు నిర్వహించిన పెద్దమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, ఎంపీటీసీల ఫోరం మండలా ధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దం తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వివాహ వేడుకలో..
గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ యువనాయకుడు రామంచ వేణు సోదరి వివాహం మండల కేంద్రంలో జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట మండల టీఆర్ఎస్ నాయకులున్నారు.
మల్లాపూర్‌లో..
తిమ్మాపూర్ రూరల్, జూన్ 17: మండలంలోని మల్లాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం పచ్చగా ఉండాలని మొక్కుకున్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, సర్పంచ్ మామిడి సతీశ్, ఎంపీటీసీ పుప్పాల కనుకయ్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.