ముస్తాబాద్, జూన్ 16: హామీ ఇచ్చిన 24 గంటల్లోనే మాట నిలబెట్టుకున్నారు మంత్రి కేటీఆర్. విద్యార్థులు అడిగిన వెంటనే వారికి సైకిళ్లు పంపించి ఔదార్యం చాటుకున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామ పాఠశాలలో బుధవారం డిజిటల్ తరగతి గదుల ప్రారంభానికి వచ్చిన ఆయనకు పరశురాం నగర్‌కు చెందిన 25 మంది విద్యార్థులు తమ సమస్యను విన్నవించారు. రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, ‘సైకిళ్లు ఇప్పించండి సార్’ అని మంత్రిని కోరగా, వెంటనే వారికి సైకిళ్లు పంపించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.