కొడిమ్యాల, జూన్ 16: కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేటలో సర్పంచ్ పునుగోటి కృష్ణారావు ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఇంటికో బోనంతో బైండ్లోళ్ల ఆటలు, ఒగ్గుడోలు ప్రదర్శనలు, డప్పుచప్పుళ్ల మధ్యన ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ‘సల్లంగా చూడు పోచమ్మ తల్లీ’ అంటూ వేడుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, సింగిల్ విండో చైర్మన్లు మేన్నేని రాజనర్సింగారావు, పోలు రాజేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. –
బోనమెత్తిన పందిల్ల
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిల్లలో గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠాపన ముగింపు సందర్భంగా గ్రామస్తులు గురువారం పోచమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులంతా ఇంటికో బోనం వండి, నెత్తిన పెట్టుకొని శివసత్తుల పూనకాలు, డప్పుచప్పుళ్ల మధ్య నడుమ ఊరేగింపుగా పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ‘సల్లంగా చూడు పోచమ్మ తల్లీ’ అంటూ వేడుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసరి లావణ్య, ఉప సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ రావి సదానందం, మాజీ సర్పంచులు అటికం శంకర్, మిట్టపెల్లి కొమురయ్య, నాయకులు కందుల సదానందం, రవి, శ్రీనివాస్, కొమురయ్య, పైడి, సంపత్, ప్రశాంత్, హరీశ్, మదు, రవి, రాజు, తదితరులు పాల్గొన్నారు.
–