పర్యారవణ పరిరక్షణ అందరి బాధ్యతని శ్రీరాంపూ ర్, మందమర్రి, ఆర్జీ1, 2, 3 ఏరియాల జీఎంలు, గనుల మేనేజర్లు, టీబీజీకేఎస్ నాయకులు పిలు పునిచ్చారు. ఆయా ఏరియాల్లో గురువారం ‘స్వచ్ఛతా పక్వాడా’ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘా నా యకులు, కార్మికులు పారిశు ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తా మని ప్రతిజ్ఞ చేశారు.
శ్రీరాంపూర్ ఏరియాలో..
శ్రీరాంపూర్, జూన్ 16: శ్రీరాంపూర్ ఏరియా గనులు, డిపార్ట్మెంట్లలో గురువారం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వ హించారు. ఎస్సార్పీ 3గనిపై మేనేజర్ సంతోష్‌కుమార్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. గని ఆవరణలో కార్మికులతో కలిసి చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రత పనులు నిర్వహించారు. పచ్చదనం, పరిశుభ్రతపై కార్మికులకు అవగాహన కల్పించారు. కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. పిట్ కార్యదర్శి ఆర్ గోపాల్‌రెడ్డి, సేఫ్టీ ఆఫీసర్ మహేంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ మేనేజర్ అరుణ్‌కుమార్, నాయకులు భాస్కర్, నాగిరెడ్డి, రాయమల్లు పాల్గొన్నారు.
ఆర్కే 6గనిపై…
ఆర్కే 6గనిపై మేనేజర్ తిరుపతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గని ఆవరణలో చెత్తాచెదారాన్ని ఊడ్చారు. ప్లా స్టిక్ కవర్లు వాడొద్దని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. టీబీజీకేఎస్ ఏజెంట్ వీరన్న, సీనియర్ పీవో సునీల్‌కుమార్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి చిలుముల రా యమల్లు, నాయకులు వెంకట్రాజం, ఆఫీస్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తదితరుపాల్గొన్నారు.
ఆర్కే న్యూటెక్ గనిపై..
ఆర్కే న్యూటెక్ గనిపై మేనేజర్ స్వామిరాజు కార్మికులతో పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతపై వివరించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపికైన ఉత్తమ ఉద్యోగిని మేనేజర్ స్వా మిరాజు, టీబీజీకేఎస్ చర్చల ప్రతినిధి బుస్స రమేశ్ అభినందించి సన్మానించారు. అండర్ మేనేజర్ చారి, సీనియర్ పీవో పాల్సృజన్, నాయకులు కిషన్, లాలా, ఐరెడ్డి తిరుపతిరెడ్డి, సదానందం తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి ఏరియాలో..
పర్యావరణ పరిరక్షణను ప్ర తి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జీఎం చింతల శ్రీ నివా స్ అన్నారు. గురువారం నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉద్యోగులతో పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు ప రిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఓదెలు, టీబీజీకేఎస్ నాయకుడు సీవీ రమణ, ఏఐటీయూసీ నాయకుడు దాగం మల్లేశ్, ఏజీఎం చక్రవర్తి, ఏజీఎం (ఈఆండ్ఎం) రాంమూర్తి, పర్యావరణ అధికారి ప్రభాకర్, ఇన్చార్జి పీఎం శ్యామ్ సుందర్, సీనియర్ పీవో మైత్రేయ బంధు, తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ఏరియాలో..
పరిశుభ్రత పాటించడం అందరి బాధ్యతని ఆర్జీ-3 జీఎం మనోహర్ అన్నారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వచ్ఛతా పక్షోత్సవాల్లో భాగంగా ఆర్జీ-3, ఏపీఏ ఏరియాలోని వివిధ గనుల్లో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీఎం కార్యాలయంలో ప్రతిజ్ఞ చేశారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, సీఎంవోఏఐ ప్రతినిధి వెంకటేశ్వర్లు, ఎస్వోటూ జీఎం బైద్య, ఇంజినీర్ ఎలీషా, సివిల్ ఏజీఎం రామకృష్ణ, శ్రీనివాసులు, సర్వే అధికారి జైనులాబొద్దీ న్, చంద్రశేఖర్, డీజీఎం విలాస్ శ్రీనివాస్, కర్ణ, ఎస్టేట్ మేనేజ ర్ హీర్యా, షఫీ తదితరులు ఉన్నారు.
ఆర్జీ-1లో ..
గోదావరిఖని, జూన్ 16: ఆర్జీ-1లోని తన కార్యాలయంలో జీఎం నారాయణ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత.. పరిశుభ్రత పాటించాలని సూచిం చారు. ఓసీపీ-5లో గని మేనేజర్ అనిల్, సేఫ్టీ ఆఫీసర్ పొనుగోటి శ్రీనివాస్ ఉద్యోగులతో శ్రమదానం నిర్వహించారు. టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ ఎడవెల్లి రాజిరెడ్డి, కుశ్నపల్లి శంకర్, ఖాసీ, ఫిరోజ్‌ఖాన్ తదితరులున్నారు.
ఆర్జీ-2 ఏరియాను ప్లాస్టిక్ రహిత డివిజన్‌గా చేయడమే లక్ష్యమని ఏరియా జీఎం టీ. వెం కటేశ్వర్ రావు అన్నారు.
ఏరియా జీఎం కార్యాలయంలో స్వ చ్ఛతా పక్వాడా నిర్వహించి జీఎం మాట్లాడారు. డివిజన్లో వారం రోజులపాటు అన్ని డిపార్టుమెంట్లపై స్వచ్ఛతపై అవ గా హన కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వ హించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్య క్షుడు ఐలి శ్రీ నివాస్, ఎస్వోటూజీఎం సందనాల సాంబయ్య, అధికార ప్రతినిధి జీ. రాజేంద్రప్రసాద్, అధికారులు ధనుంజ య్, మురళీకృష్ణ, అనిల్ కుమార్, పీవీ ర మణ, చంద్రమౌళి, అజయ్ కుమార్, వేణుగోపాల్, వంశీధర్, సుబ్రమణ్యం, సు రేశ్బాబు, సత్యనారాయణ పాల్గొన్నారు.