శంకరపట్నం, నవంబర్ 18: కార్తీక శుద్ధ చతుర్దశిని పురస్కరించుకొని మండలంలోని శివ, కేశవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కేశవప ట్నం శివాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ఆవరణలో గీతాపారాయణం నిర్వహించారు. అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఫల, పుష్పాలు సమర్పించి, పంచామృతాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలో గల ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అల్లెంకి తిరుపతయ్య భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పాలడుగుల బాబన్న, పాలడుగుల సోమేశ్వర్, హనుమాన్ ఆలయ చైర్మన్ తనుకు ఓంకారం, భక్తులు అల్లెంకి మనోహర్, నాగభూషణం,శంకరానందం, మర్యాల కృష్ణమూర్తి, శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.